బామ్మ వయసులో అమ్మ అయిన మంగాయమ్మ
మంగాయమ్మ(74) అనే వృద్ధురాలు పండంటి కవలలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌లో ఈరోజు డాక్టర్ శనక్కాయల అరుణ, ఉమా శంకర్.. మంగాయమ్మకు విజయవంతంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించగా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.
ADVERTISEMENT
పెళ్లైన 57 ఏళ్ల తర్వాత మంగాయమ్మకు గర్భం వచ్చింది. ఐవీఎఫ్ ద్వారా వృద్ధురాలు గర్భం ధరించింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఎపిలోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1992లో పెళ్లయ్యింది.
ADVERTISEMENT
