ఘోరాలు అన్ని హైదరాబాద్ లో నే జరిగేలా ఉన్నాయి. హైదరాబాద్ లో నివసించే వారికీ ప్రశాంతత లేకుండా అయిపోతుంది. మొన్నటికి మొన్న ఓ యువతిపై మెట్రో స్టేషన్ పెచ్చు ఊడి పడటంతో ఆమె మృతి చెందిన ఘటన ఇంకా కళ్ళ ముందు ఉన్నట్టు ఉంది. ఇప్పుడు మరో ప్రమాదకరమైన పగుళ్లు ప్రజలను భయపెడుతుంది. ఏంటి ఆ పగుళ్లు అని అనుకుంటున్నారా?
అదేనండి .. మన దేశంలోనే అతి పొడవైన ఫ్లై ఓవర్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన రహదారి మొత్తం 11.633 కిలోమీటర్ల దూరం ఉండే పీవీ ఎక్స్‌ప్రెస్ వే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మెహదీపట్నం నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా కట్టిన ఈ ఫ్లై ఓవర్ పై ఓ పిల్లర్ పగుళ్ళకు గురైంది. ఆ పిల్లర్ నంబర్ 20 వద్ద జాయింట్లు కొన్ని పగిలి వాహనదారులను భయపెడుతుంది.
ఈ పిల్లర్ 20 కింద నుంచి వెళ్లే వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఈ ఫ్లై ఓవర్ ఏ క్షణంలో కూలిపోతుందో అని భయానికి గురవుతున్నారు. కాగా ఇటీవలే ఫ్లై ఓవర్ పై గుంతలు ఉన్నాయని రిపేర్లు చెప్పట్టారని సమాచారం. మరి ఈ ఫ్లై ఓవర్ పగుళ్ల పై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.