వైరల్ జ్వరాలు, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధుల నివారణకు ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ సిబ్బంది దోమల నివారణకు, పరిశుభత్రకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
మీ ఇంటి పరిసరాలను పరిశీలించండి, నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోండి. పూల కుండీలు, ఎయిర్ కూలర్లు, ఇతర నీరు నిలిచే వస్తువులను తనీఖీ చేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేటీఆర్ తన సొంత ఇంటి పరిసరాలను పరిశీలించి దోమల మందు చల్లారు. ప్రతి ఒక్కరూ ఇలాగే చేయాలని కోరుతూ ట్వీట్ చేశారు.
హీరో ప్రభాస్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మద్దతు తెలిపారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీటును ప్రభాస్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేసి ప్రజలను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. యంగ్ రెబల్ స్టార్ చేసిన ఈ పనిపై థాంక్స్ చెబుతూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ప్రభాస్ అభిమానులు కూడా కేటీఆర్ చేసిన ఈ ట్వీటును షేర్ చేస్తున్నారు.