తెలుగు తెరపైకి మరో కొత్త అంద దూసుకొస్తోంది. మలయాళ ముద్దుగుమ్మ ‘ఐమా సెబాస్టియన్’ తెలుగు ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన ‘పడయోత్తం’ మలయాళ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రంలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అటు గ్లామర్‌పరంగానూ, ఇటు యాక్షన్ పరంగానూ ఐమా సెబాస్టియన్‌కు మంచి మార్కులే పడ్డాయి. మలయాళంలో విజయవంతమైన ఆ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఇప్పుడు ‘పడయోత్తం’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. తెలుగులోను కథానాయికగా ‘ఐమా సెబాస్టియన్’ నే తీసుకున్నారు. విను యజ్ఞ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో హీరోగా సుమంత్ చేయనున్నాడు. అమధ్యే మొదలు కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

సుమంత్ ప్రస్తుతం కపటదారి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ‘పడయోత్తం’ రీమేక్ సినిమా చేయనున్నాడని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
‘ఐమా సెబాస్టియన్’… ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా టచ్ లో ముద్దుగుమ్మకి చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు.
దుబాయ్‌లో నివసించే ‘ఐమా సెబాస్టియన్’… సినిమాలపై ఆసక్తితో… మాలీవుడ్‌లో అడుగుపెట్టింది.
2018 జనవరి 4న కెవిన్ పాల్‌తో ఈ బ్యూటీకి వివాహమైంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది ‘ఐమా సెబాస్టియన్’.
‘ఐమా సెబాస్టియన్’ మంచి డాన్సర్ కూడా… సినిమాల్లోకి రాకముందు… క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది.

పడయోత్తం కంటే ముందు ఐమా… మరో నాలుగు సినిమాలు చేసింది. 2016లో దూరం, జాకోబింటే స్వర్గరాజ్యం, హల్వా (Short Film) చేసింది. అలాగే 2017లో మంతిరివలలికల్ తల్లిర్కుంబొల్ చేసింది. తద్వారా నటనలో, అభినయం ప్రదర్శించడంలో ఆరితేరింది.
అప్పట్లోనే తెలుగు తెరకు పరిచయమయ్యే అవకాశాన్ని కరోనా వల్ల మిస్ చేసుకుంది కేరళ కుట్టి ఐమా సెబాస్టియన్.

అందంతోపాటూ, అభినయం చూపించే ఈ అమ్మడు తెలుగును సక్సెస్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి.

#AimaRosmySebastian

#AimaRosmySebastian

#AimaRosmySebastian

#AimaRosmySebastian

#AimaRosmySebastian

#AimaSebastian

#RosmySebastian
