ADVERTISEMENT
ADVERTISEMENT
దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. ఇవాళ మంత్రి హరీశ్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరి సమావేశం కొనసాగింది.
ఈ సందర్భంగా తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని హరీశ్ ను జగ్గారెడ్డి కోరారు. జగ్గారెడ్డి వినతికి హరీశ్ సానుకూలంగా స్పందించారు. తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. వీరిద్దరి భేటీ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.