తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా.. ‘అసురన్’. వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నాడు. ధనుష్, వెట్రి మారన్‌ల కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇది. అసురన్‌లో ధనుష్.. రాజదేవన్, కాళీగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
మలయాళ నటి మంజు వారియర్ అతనికి జోడీగా నటిస్తుంది. ఆమెకిదే ఫస్ట్ తమిళ్ సినిమా.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పూమణి రాసిన తమిళ నవల ‘వేక్కై’ ఆధారంగా.. భారీ బడ్జెట్‌తో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన అసురన్ అక్టోబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదల కానుంది. కేవలం అమెరికాలోనే 100 థియేటర్లలో విడుదలవుతోంది. ప్రకాష్ రాజ్, పశుపతి, యోగిబాబు, తలైవాసల్ విజయ్, బాలాజీ శక్తివేల్, ఆడుగలం నరేన్ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా : వేల్‌రాజ్, ఎడిటింగ్ : వివేక్ హర్షన్, సంగీతం: జి.వి.ప్రకాష్.