పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను అభిమానులు ఎలా చూసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. అయితే హీరోయిన్ మాధవీలతకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఎన్నోసార్లు ప్రకటించింది. 2000వ సంవత్సరం జూన్ 6వ తేదీన పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను రాసుకున్న ప్రేమకవితను ఫేస్ బుక్‌లో పంచుకుంది.
‘మనసులో ఏదో వేదన
కారణం తెలియక పడుతున్నా తపన
హృదయంలో అనురాగం అనే భావన
దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన“
ఈ కవితపై వివరణ గూర్చి ఒక టీవీ ఛానల్ మాధవీలతను సంప్రదించింది. మాధవి మాట్లాడుతా.. పవన్ ను టీనేజ్ వయసు నుంచే అభిమానించడం, ఆపై ప్రేమించడం, ఆ తరువాత ఆరాధించడం ఆలా మొదలయింది. ఇప్పటికి అది అలానే కొనసాగుతుంది. ఆలా వచ్చిన కవితే ఇదంటూ చెప్పుకొచ్చింది మాధవి. ఎందుకో తెలీదు షేర్ చెయ్యాలనిపించింది చేసేశాను. కొందరు హేటర్స్ చేసే కామెంట్స్ పట్ల వారు వారి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించుకోవాలని చెప్పుకొచ్చింది మాధవీలత.