లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ (73) నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. తాను నిర్వహించే కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒప్పుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ నవీన్ అరోరా మీడియాకు వెల్లడించారు.
ADVERTISEMENT
షహజన్‌పూర్‌లో లా కాలేజీలో అడ్మిషన్ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్..తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే. కాలేజ్‌లోని హాస్టల్‌లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ADVERTISEMENT