ADVERTISEMENT
ADVERTISEMENT
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగి 36 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. పాపికొండలను చూసేందుకు పర్యాటకులు లాంచీలో వెళ్తుండగా ఈ పెను విషాదం చోటుచేసుకుంది. దీంతో.. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాగా.. నేడు ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక రెస్య్యూ బృందాలు.. కచ్చులూరికి రానున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి.. యుద్ధ ప్రాతిపదికన గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు. అలాగే.. హెలికాఫ్టర్, ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేస్తున్నారు. భాదితులకు 10 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు సీఎం జగన్.