ADVERTISEMENT
ADVERTISEMENT
తెలంగాణ సిఎం కెసిఆర్ ఈరోజు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధానితో ఉదయం 11.30 గంటలకు సమావేశం కానున్నారు. మోడీ రెండోసారి ప్రధాని అయిన తరువాత, సిఎంగా కెసిఆర్ రెండోసారి గెలిచిన తరువాత ఇరువురు భేటీ కాలేదు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక మాంద్యంతో రాష్ట్రాలకు కేంద్రం నిధులు తగ్గడం, రా ష్ట్రాల ఆదాయం కూడా తగ్గిపోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది.