ADVERTISEMENT
ADVERTISEMENT
హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అన్నపూర్ణ బ్లాక్‌లోని ఐదో అంతస్తులో జగదీష్ అనే జ్యోతిష్యుడి క్యార్యాలయంలోకి కొందరు వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ ప్రవేశించారు. తనిఖీల పేరుతో సోదాలు చేసి 25 తులాల బంగారు ఆభరణాలతో ఊడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.