ADVERTISEMENT
ADVERTISEMENT
బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్సే(67) ముంబయిలో బుధవారం తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న ఈయన.. చికిత్స నిమిత్తం ఈ రోజు ఉదయమే ఆసుపత్రిలో చేరారు. రామ్సే సోదరుల్లో ఒకరైన శ్యామ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణవార్తను కుటుంబ సభ్యులే తెలియజేశారు. 1970, 80ల్లో హర్రర్ సినిమాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు శ్యామ్. ‘పురానీ హవేలి’, ‘తఖానా’, ‘దర్వాజా’, ‘పురానా మందిర్’, ‘వీరానా’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.