ADVERTISEMENT
రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు మిలిగారు. గురువారం నామినేషన్‌ల ఉపసంహారణకు ఆఖరి గడువు కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి విడుదల చేసిన తుది జాబితాలో 28 మంది అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఈఉప ఎన్నికకు 76 నామినేషన్‌లు దాఖలుగా, నామినేషన్‌ల పరిశీలన సందర్భంగా 45 నామినేషన్‌లను తిరస్కరించగా 31 మంది అభ్యర్థులు మిగిలారు.
ADVERTISEMENT
గురువారం నామినేషన్‌ల ఉపసంహారణకు ఆఖరి గడువుగా ఉండటంతో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌లను ఉపసంహారించుకున్నారు. ఈ నేపథ్యంలో తుది జాబితాలో ప్రధాన పార్టీలైన టిఆర్‌ఆర్, కాంగ్రెస్, బిజెపి, టిడిపిల అభ్యర్థుల పాటు మరో 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.