ఫ్లిప్ కార్ట్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 మధ్యలో బిగ్ బిలియన్ డేస్ ఉన్నాయని ప్రకటించాక, అదే రోజుల్లో అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను ప్రకటించింది. దీంతో రెండు సంస్థల మధ్య పోటీ ఒక్కసారిగా వేడెక్కింది. ఆఫర్ల మీద ఆఫర్లతో వినియోగదారునిపై వరాల జల్లు కురిపిస్తున్నాయి.
ఇప్పటికే ఎన్నో ఉత్పత్తులపై ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు ప్రకటించింది. అయితే మొబైల్స్ ను అత్యంత తక్కువ ధరలకు అందిస్తామనే మాటను నిలబెట్టుకుంటూ మరో ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ తాజాగా ప్రకటించింది. రెడ్ మీ నోట్ 7ఎస్ ఫోన్ ఎమ్మార్పీ రూ.13,999గా నిర్ణయించారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఆ మొబైల్ ను రూ.11,999కు విక్రయిస్తున్నారు. అయితే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్ లో భాగంగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 మధ్య ఆ మొబైల్ ధరను రూ.3,000 తగ్గించి రూ.8,999కి విక్రయించనున్నారు.
అయితే హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డు ద్వారా ఈ మొబైల్ ను కొనుగోలు చేసిన వారికి మరో రూ.1,500 తగ్గింపు లభించనుంది. అంటే ప్రస్తుతం మార్కెట్లో రూ.11,999కు విక్రయించబడుతున్న రెడ్ మీ నోట్ 7 ఎస్ మొబైల్ రూ.4,500 తగ్గింపుతో రూ.7,499కే లభించనుందన్న మాట. ఈ తగ్గింపుతో మార్కెట్లో 48 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న ఫోన్లలో రెడ్ మీ నోట్ 7ఎస్ ధరే అత్యంత తక్కువగా ఉండనుంది.