ADVERTISEMENT
ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం ఇచ్చేందుకు కార్పొరేట్ పన్నుల్లో కోత విధించారు. దేశీయ కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నూతన కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతం నుంచి 15 శాతం తగ్గించారు.
2019 అక్టోబర్ 1 తర్వాత తయారీ రంగంలో తాజా పెట్టుబడులతో ప్రారంభించే దేశీయ కంపెనీలకు కేవలం 15 శాతం ఆదాయ పన్ను చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు.నూతన పన్ను రేట్లు, ఇతర ఊరట ఇచ్చే చర్యలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరంభమైన ఏప్రిల్ 1 నుంచే వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో నూతన నిబంధనలకు అనుగుణంగా సర్ధుబాటు చేస్తామని తెలిపారు.
ADVERTISEMENT