ADVERTISEMENT
ADVERTISEMENT
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు అజహరుద్దీన్ ఎన్నికను ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. హెచ్‌సీఏలోని 227 మంది సభ్యుల్లో 223 మంది ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ బరిలోకి దిగినప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అజహరుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానళ్ల మధ్యే జరిగింది. ఉప్పల్ మైదానం బయట అజహరుద్దీన్ వర్గం సంబురాలు జరుపుకున్నారు.