మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లతో సినిమా చేస్తారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా.. ‘వాల్మీకి’ ప్రమోషన్‌లో భాగంగా హరీశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఇద్దరు స్టార్లతో సినిమాపై క్లారిటీ ఇచ్చేశారు. ‘పవన్‌తో గబ్బర్ సింగ్ 3 ఉంటుందని పుకార్లు వస్తున్నాయి.. అలా జరగాలని మీరు కోరుకోండి.
ADVERTISEMENT
నేను కూడా పవన్ కళ్యాణ్‌తో మళ్ళీ చిత్రం చేయాలనీ ఎంతగానో కోరుకుంటున్నాను. అలాగే ప్రభాస్, మహేష్ లాంటి హీరోలతో మూవీస్ చేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి. అనేక చోట్ల ఫ్యాన్స్ అడుగుతుంటారు. కానీ ‘బాహుబలి’ లాంటి సినిమా తీయాలని మనం అనుకుంటే జరగదు, దానంతటికదే అది జరగాలంతే..’ అని హరీశ్ చెప్పుకొచ్చారు.
ADVERTISEMENT
