ADVERTISEMENT
ADVERTISEMENT
కాసేపట్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాలు అందనున్నాయి. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దీనికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా కాసేపట్లో విజయవాడలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛన ప్రాయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. అనంతరం అక్కడకు వచ్చినవారి నుద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు.