వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలన గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఒక నివేదిక విడుదల చేశాడు. జగన్ ప్రభుత్వం వంద రోజుల పనితీరుపై 9 అంశలను ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్ .
ఇందులో ముఖ్యంగా జగన్ ప్రవేశపెట్టిన పధకాల గురించి, అలాగే గ్రామా వాలంటీర్ వ్యవస్థ గురించి, రాష్ట్రంలో వచ్చి వరదల సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి, రాష్ట్రంలో ప్రబలుతున్న విష జ్వరాలు గురించి, ఇసుక విధానంలో ప్రభుత్వం విఫలం కావటం గురించి ప్రస్తావించారు.
151 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణమైన మెజారిటీ సాధించిన జగన్ ని చూసి సమీప భవిష్యత్తులో విమర్శించే అవకాశం రాదని అనుకున్న కానీ, వంద రోజుల్లోనే ఆయన పాలనపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నో ప్రజారంజక పధకాలు ప్రవేశపెట్టాడు, కానీ వాటిని అమలు చేయాలంటే రూ. 50 వేలకోట్లు కావాలి.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే వాటిని నెరవేర్చటం అసాధ్యమని తెలుస్తుంది. గత ప్రభుత్వంలో అవినీతి ఉంటే దానిని నిరూపించాలి కానీ, ప్రాజెక్ట్స్ ఆపేయటం కరెక్ట్ కాదు. ఇలా చేయటం వలన ప్రకాశం జిల్లాకి రావలసిన ఒక ప్రాజెక్టు మహారాష్ట్రకి వెళ్ళిపోయింది.
వచ్చే ఎన్నికల నాటికీ సర్వం సిద్ధం చేసుకోవాలనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో గ్రామ వాలంటీర్ పోస్టులు ఏర్పాటు చేశావు. అందులో వైసీపీ కార్యకర్తలనే నియమించారు. గతంలో టీడీపీకి జన్మభూమి కమిటీలు వలన ఎలాంటి నష్టం కలిగిందో అంతకుమించి నష్టం మీకు ఈ వాలంటీర్ పోస్టులు వలన కలుగుతుంది.