కియారా అద్వాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పుడు అందరూ కియారాను ఒక బ్యూటిఫుల్ బాలీవుడ్ హీరోయిన్ అని సరిపెట్టుకున్నారే కానీ త్వరలో క్రేజీ బ్యూటీగా మారుతుందని.. లస్టు భామగా జనాలకు షాక్ ఇస్తుందని ఊహించలేదు. ఊహించనివి జరగడమే కదా జీవితం.
కియారా అంతటితో ఆగకుండా ‘కబీర్ సింగ్’ లో నటించడం.. ఆ సినిమాకాస్త బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా మారడంతో కియారా క్రేజ్ మరింతగా పెరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కియారా ఫ్యాషన్ సెన్స్ మరో ఎత్తు. సందర్భం ఏదైనా దానికి తగ్గ దుస్తులు ధరించి చూపరులను మాయలో పడేసి తనవైపు ఆకర్షించడంలో కియరా ఎక్కడో పీ హెచ్ డీ అయితే చేసే ఉంటుంది.
రీసెంట్ గా కియారా ముంబైలో బయట కనిపించింది. ఇక ఫోటోగ్రాఫర్ క్లిక్కు.. క్లిక్కుమని ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో కళాత్మక నెటిజన్లకు అందుబాటులో ఉంచారు. ఇంకేముంది.. అందరూ కియారా ఫ్యాషన్ ను.. ఆ స్టైల్ ను.. ఆ యాటిట్యూడ్ ను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫోటోలో కియారా ఒక లైట్ కలర్ స్లీవ్ లెస్ ఇన్నర్ లాంటి టీ షర్టు ధరించింది. ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ ఫోటో.
