ADVERTISEMENT
ADVERTISEMENT
టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోర్టుమార్టం పూర్తయింది. సుమారు రెండు గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించారు. మరికాసేపట్లో కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించనున్నారు. అక్కడ కోడెల భౌతికకాయానికి పార్టీ నాయకులు నివాళులర్పించనున్నారు. అనంతరం నర్సరావుపేట కండ్లగుంటకు పార్థివదేహాన్ని తరలించనున్నారు. కోడెల శివప్రసాద్‌రావు అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నారు.