భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని పీవీ సింధు సువర్ణాక్షరాలతో లిఖించిన సంగతి తెలిసిందే. జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో బాసెల్ (స్విట్జర్లాండ్) అలవోకగా గెలిచిన సింధు.. ఈ టోర్నీలో స్వర్ణం పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పింది.
ADVERTISEMENT
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సినీ హీరో అక్కినేని నాగార్జున ఆకాక్షించారు. రాబోయే ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలన్నారు. ఈ మేరకు ఆయన అన్నపూర్ణ స్టూడియోలో సింధుకు చాముండేశ్వరి నాథ్ ప్రకటించిన బీఎండబ్ల్యూ కారును అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోచ్ పుల్లెల గోపిచంద్ తో పాటు సింధు తల్లిదండ్రులు పాల్గొన్నారు. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సింధు గోల్డ్ మెడల్ సాధించినందుకు గానూ ఆమెకు కారును బహుకరించారు.
ADVERTISEMENT
