ADVERTISEMENT
టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమాకి సంబంధించి అనుష్క ఫస్ట్ లుక్ ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా నేడు అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు.
‘సాక్షి’ అనే ఒక చిత్రకారిణిగా ఈ పోస్టర్లో ఆమె కనిపిస్తోంది. అనుష్క లుక్ డిఫరెంట్ గా వుంది. విభిన్నమైన కంటెంట్ కావడంతో, అంతా ఈ సినిమా పట్ల ఆసక్తిని చూపుతున్నారు. మాధవన్ .. మైఖేల్ మాడిసన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ADVERTISEMENT
