ADVERTISEMENT
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితం మోదీ న్యూయార్క్ చేరుకున్నారు. న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడు రోజుల పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో రెండు సార్లు సమావేశం అవుతారు. మోదీ, ట్రంప్ మధ్య మొదటి సమావేశం సెప్టెంబర్ 22న హూస్టన్‌లో జరుగుతుంది.
ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ భారత సంతతి అమెరికన్లు, అక్కడ నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హూస్టన్ నగరంలో జరిగే ‘Howdy Modi’ మోడీ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు దేశంలోని దాదాపు 50 మంది ఎంపీలు కూడా హాజరవుతారు. ఇద్దరు నేతలు సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో మరోసారి సమావేశం అవుతారు. అక్కడ మోదీ ఐక్యరాజ్యసమితి వార్షిక ప్లీనరీ సెషన్‌కు హాజరవుతారు.
ADVERTISEMENT