ADVERTISEMENT
ADVERTISEMENT
ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియాకి చెందిన ఓ విమానం పిడుగుపాటుకు గురైనట్టు సమాచారం. నిన్న రాత్రి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైందని అంటున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది.అయితే విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం ప్రారంభమైంది.
విమానంపై పిడుగు పడకున్నా ఆ ప్రభావం మాత్రం విమానంపై పడింది. దీంతో విమానం గాల్లో ఊయలలా అటూ ఇటూ ఊగిపోయిందట. ప్రయాణికులు ఎవరూ గాయపడకపోయినప్పటికీ కొంత మంది సిబ్బంది మాత్రం గాయపడ్డారట. విమానం గన్నవరంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.