ADVERTISEMENT
ADVERTISEMENT
టాలీవుడ్ లో సాహో హడావిడి అయిపోయింది. సినిమా విడుదల ముందు ప్రమోషన్స్ లో హల్ చల్ చేసింది చిత్రయూనిట్ విడుదల తర్వాత సినిమా ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులను కూడా దారుణంగా నిరాశ పరిచింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఎంత వసూళ్లు చేసిందంటే. రూ. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.232కోట్లు, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 138 కోట్లు వచ్చాయి.
అయితే, ఈ సినిమా బాలీవుడ్ లో భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 232.6 కోట్ల రూపాయల షేర్ ను సాధించడం విశేషం. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దాకపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించాడు.