బంగ్లాదేశ్ నుంచి యువతులను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను హైదరాబాద్‌లోని ఛత్రినాక పోలీసుల సాయంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన యూసుఫ్‌ఖాన్-బేగం దంపతులు బంగ్లాదేశ్ నుంచి ఐదుగురు యువతులను నగరానికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు.
ADVERTISEMENT
పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు దాడిచేసి రెడ్ హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని వారిని స్వదేశానికి పంపారు.
ADVERTISEMENT
కాగా, ఏప్రిల్‌లో ఛత్రినాకలో వ్యభిచార గృహాలపై దాడులు చేసిన పోలీసులు ఐదుగురు బంగ్లాదేశ్ యువతులకు విముక్తి కల్పించారు. కాగా, హైదరాబాద్‌లో ఎన్ఐఏ ఇలాంటి కేసును నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.