మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో మాచో హీరో గోపీచంద్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. ఈ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ఇది. ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ను తాజాగా ఖరారు చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించనుంది.
తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ ‘బెంగాల్ టైగర్’ లో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అలాగే, గోపీచంద్‌తో సంపత్ నంది పనిచేయడం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరి కాంబోలో ‘గౌతమ్ నంద’ సినిమా వచ్చింది. అయితే, ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రానికి పవన్ కుమార్ సమర్పిస్తున్నాడు.