ADVERTISEMENT
ADVERTISEMENT
తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదు కానీ, అవమానిస్తున్నారన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ అనడం సరికాదన్నారు. తెలంగాణ బిల్లు పెట్టిన రోజును అమిత్‌షా బ్లాక్‌డే అంటున్నారన్నారు. మోడీ, అమిత్‌షా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. బీజేపీ వస్తే రాష్ట్ర పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. మహారాష్ట్ర రైతులు వచ్చి తెలంగాణలో కలుస్తామని అంటున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలే మా పాలనను ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు.