ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై తాము కేసులు పెట్టలేదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడూ ఆయనను అరెస్ట్ చేసి వేధించలేదని, వైసీపీ ఎప్పుడూ శవరాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు.
కోడెల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. కోడెల మృతిపై రకరకాల వార్తలు వచ్చాయని, చికిత్స కోసం బసవతారకం ఆసుపత్రికి తీసుకెళ్లడంతో సందేహాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT
ఈ వ్యవహారంలో సాక్ష్యాలు తారుమారు కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోడెల వల్ల ఇబ్బందులు పడినవారే ఆయనపై స్వచ్ఛందంగా కేసులు పెట్టారు తప్పితే ప్రభుత్వం కేసులు పెట్టలేదని బొత్స పునరుద్ఘాటించారు. కోడెల మృతికి గల కారణాలపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.