రకరకాల టాక్సుల పేరుతో సామాన్యుడి జేబులు ఖాళీ చేస్తున్న ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్స్ కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. బుక్ మై షో, ఈజీ మూవీస్, పేటీఎం యాప్స్ ద్వారా ఆన్ లైన్ సినిమా టికెట్లు బుక్ చేసుకునే వారికి అదనంగా టాక్సులను జోడించి విపరీతమైన దోపిడీకి పాల్పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాప్ ల ఆగడాలకు తెలంగాణా ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ టికెట్ల అమ్మకాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ లను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది.
సినిమా టికెట్ల విషయంలో ఆన్ లైన్ అమ్మకాలను ప్రభుత్వం త్వరలో రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వమే అధికారికంగా సినిమా టికెట్ల అమ్మకాల కోసం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. ఇలా చేస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభపడతారని మంత్రి పేర్కొన్నారు.