175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 151 సీట్లు వైసీపీ గెలుచుకోవడం అంటే నిజంగా ఏపీలో చరిత్ర అని చెప్పాలి… పైగా రెండోసారి జగన్ రెట్టింపు ఉత్సాహంతో చేసిన పాదయాత్ర బాగా ప్లస్ అయింది.. జగన్ ఇచ్చిన నవరత్నాలు జనాలకు బాగా దగ్గర చేశాయి.. అయితే ఆ నవరత్నాల హమీ నెరవేరకపోతే, మళ్లీ బాబుని పక్కన పెట్టినట్టు జగన్ ని పక్కన పెడతారు. ఇది ఎవరికి అయినా తెలిసిన నమ్మదగిన విషయం ..అందుకే జగన్ ఇలా తన నవరత్నాలపైనే ఫోకస్ చేశారు. ఇచ్చిన హమీలు నెరవేర్చేదిశగా పాలనలో ముందుకు వెళుతున్నారు.
అయితే తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు జాగ్రత్తలు చెప్పారు, జగన్ ప్రజలనే కాదు ఎమ్మెల్యేలని తన పార్టీ నాయకులని కూడా సాటిసిఫై చేయాలి, లేకపోతే అసలుకే మోసం జరుగుతుంది అంటున్నారు. ఇప్పటికే తాను అవినీతి అక్రమాలు సహించను అని జగన్ అంటున్నారు, బాగానే ఉంది .. అధికారుల్లో కూడా మార్పు తీసుకురావాలి, జగన్ ఒక్కరే అలా ఉంటే సరిపోదు, వ్యవస్ధలో మార్పు తీసుకురావాలి, ఏం చేసినా బహిరంగంగా ప్రజలకు తెలియచేయండి పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అని సలహ ఇచ్చారు ఉండవల్లి.
ఇక ఎమ్మెల్యేలతో తాను చాలా బీజీగా ఉండటం వల్ల జగన్ కలవడం లేదు, ఇది తెలిసిందే, దీంతో వారిలో కాస్త అసంతృప్తి ఉంది అది కొందరు ఉండవల్లికి చేరవేసి ఉంటారు..ఈయన సూచన ప్రాయంగా ఇలా చెప్పే ఉంటారు అని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే పీవీకి- ఎన్టీఆర్ కి కూడా ప్రజలు వెనుక నుంచి ఏమీ చేయలేదు, నాయకులే వారిని దించేశారు. సో జగన్ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేల మాట వినాలని చెప్పారు ఉండవల్లి.. అయితే ఈ జాగ్రత్తలు వైసీపీ ఎలా తీసుకుంటుందో చూడాలి.