ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే వరుస ఆఫర్లు అందుకుంటోంది హీరోయిన్ కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ నెల 12న ఆ సినిమా విడుదలవుతోంది.
ADVERTISEMENT
పోస్టర్లు, ట్రైలర్ ద్వారా కృతి చాలా మందిని ఆకట్టుకుంది. కృతి తొందరలోనే సూపర్‌స్టార్ అవుతుందని మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కృతికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో మూడు కొత్త సినిమాలున్నాయట. ఇప్పటికే నాని, సుధీర్‌బాబులతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు ఎక్జయిటింగ్ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.
కానీ ఉప్పెన సినిమా విడుదలైన తర్వాతే కొత్త సినిమాలకు సంతకం చేస్తానని మీడియా ముచ్చట్లలో చెప్పుకొచ్చింది ఉప్పెన పాప.
ADVERTISEMENT
#KrithiShetty
#KrithiShetty
