జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు గత ఏడాది డిసెంబరులో ఎన్నికలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ 56 వార్డులు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 48 వార్డులు గెలవగా, ఎంఐఎం 44 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లకే పరిమితమయింది.
గురువారం ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్ ఎన్నికకు కోరం లేకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు.
అయితే గ్రేటర్ మేయర్ గా రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి పేరును సీఎం కేసిఆర్ ఖరారు చేశారని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి ఈ పదవిని ఇస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. కానీ తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేసిఆర్.. విజయలక్ష్మి వైపు మెగ్గు చూపారని తెలుస్తోంది.