ADVERTISEMENT
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ అమిత్ పంఘల్ సంచలనం సృష్టించాడు. 52కిలోల విభాగంలో ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ప్రత్యర్థి సాకేన్ బిబొస్సినోవ్‌ను మట్టికరిపించాడు. అయితే ఇక్కడికి వెండి పతాకాన్ని కన్ఫాం చేసుకున్నాడు. రేపు గోల్డ్ మెడల్ కోసం తలపడనున్నాడు. ఫైనల్‌లో షకోబిద్దీన్ జొరవ్‌పై పంచ్‌లు విసరనున్నాడు.
ADVERTISEMENT
తొలిసారి ఫైనల్‌కు వెళ్లిన భారత బాక్సర్‌గా రికార్డు సృష్టించాడు పంఘల్. పంఘల్ గతేడాది… ఆసియా గేమ్స్‌లో కూడా గోల్డ్ మెడల్ సాధించాడు. మొన్నీమధ్య తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో 52 కేజీల కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు.