కేరళలోని ఎర్నాకుళం ప్రాంతం మారేడులో నాలుగు భారీ అక్రమ కట్టడాల అపార్ట్మెంట్ ల కూల్చివేతకు సుప్రీంకోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీచేసింది. సుప్రీంకోర్టు నివాసితులను అపార్ట్మెంట్లను ఖాళీ చెయ్యమనే గడువు నేటితో ముగియడంతో కూల్చివేత ప్రక్రియ పట్ల అధికారులు కూడా వేగం పెంచారు. అక్టోబర్ 11న కూల్చివేత ప్రారంభం కావడంతో అధికారులు అపార్ట్మెంట్ లను ఖాళీ చేయించే పనిలో పడ్డారు.
దింతో అపార్ట్మెంట్ లోని నివాసితులు ప్లాంట్స్ యాజమాన్యాన్ని సంప్రదిస్తే, వారు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దింతో గడువు సమయం పొడిగించాల్సిందిగా నివాసితులు కోరుకుంటున్నారు. అధికారులు మాత్రం చట్టం తన పని తాను చేస్తున్నట్లుగా మొత్తం 326 ప్లాట్లకు 243 ప్లాట్లను ఖాళీ చేయించారు. దింతో నివాసితులందరికి షాక్ తగిలినట్లైయింది. కొందరు ఖాళీ చేసి వేరే చోటికి షిఫ్ట్ అవుతుంటే, మిగితా కొందరు మాత్రం సెకండ్ హ్యాండ్ గా వారి ఫరిచర్స్, మిగితా సామాగ్రిని పబ్లిక్ గా అమ్మేసుకుంటూ ఖాళీచేస్తున్నారు.
అయితే, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీసుకున్న అక్రమ కట్టడాల నిర్మూలన నిర్ణయంతో చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సబబుగానే అనిపిస్తుంది. ఇటీవలే జగన్ ఇలాంటి అక్రమ కట్టడాల పట్ల ఎక్కువగానే ఫోకస్ చేస్తున్నారు. ఆ విధంగా అధికార యంత్రాంగాన్ని కూల్చివేతకు అనుమతులు కూడా జారీ చేస్తున్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయాలు గత ప్రభుత్వాలు కట్టిన అక్రమ కట్టడాలు ఐతే, సుప్రీంకోర్టు మాత్రం ఏకంగా ప్రజా అపార్ట్మెంట్ లనే కూల్చివెయ్యమనడం విశేషం. దింతో ఏపీ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం వారికీ కనువిప్పు కలిగించేలా వుంది.
