‘సొంతం’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన అందాల భామ నమిత. ఇటు తెలుగు అటు తమిళ సినిమాలలో నటిస్తూ యూత్ మనసులు గెలుచుకుంది. ఆమె కోసం తమిళనాడులో గుడి కూడా కట్టారంటే నమితకున్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.
వెంకటేష్ హీరోగా నటించిన జెమినీ చిత్రంలోను నటించిన నమిత చివరిగా సింహా చిత్రంలో బాలయ్యతో ఆడిపాడింది. అయితే మియా అనే తమిళ చిత్ర షూటింగ్ సమయంలో వీరేంద్ర, నమితల మధ్య పుట్టిన ప్రేమ పెళ్లిగా మారింది. తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో వేదమంత్రాల సాక్షిగా నవంబర్ 24,2018న వీరేంద్రని వివాహం చేసుకుంది.

బొద్దుగా ఉన్న హీరోయిన్స్‌ని అమితంగా ఇష్టపడే తమిళ ప్రేక్షకులు ఆమె అందానికి,నటనకు ఫిదా అయ్యారు. ఒక వీరాభిమాని అయితే ఏకంగా ఆమెకి గుడి కట్టించాడు.ఇక వివాహం తర్వాత నమిత సినిమాలు తగ్గించింది.పెళ్లి తరువాత భర్తతో కలిసి మీడియాలో బాగానే సందడి చేసిన నమిత ఆ తరువాత మాత్రం పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌కే పరిమితం అయ్యింది.
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న నమిత తన ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. డైట్ మెయింటైన్ చేస్తూ పలు వర్కవుట్స్‌తో స్లిమ్‌గా మారే ప్రయత్నం చేస్తుంది. తాజాగా నమితకి సంబంధించి సోషల్ మీడియాలో పలు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అవి ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
