‘సర్కారు వారి పాట’ మేకర్స్ తిరిగి షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో, హీరోయిన్లుగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దుబాయ్‌లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత రెండో షెడ్యూల్‌ను దుబాయ్‌తో పాటు గోవాలో చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే నేడు సెట్స్ లోకి ఎంట్రీ అవుతున్నట్లుగా మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాదు లోనే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికి మాస్క్ ధరించాలని పేర్కొంది. కాగా ఇదివరకే మహేష్ తన యూనిట్ సభ్యులందరికి వాక్సినేషన్ వేయించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్‌గా నటించనున్నారు. కీర్తి సురేష్ కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని..వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. మహేష్ బాబు తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.

Image

Leave a Reply

Your email address will not be published.