కరోనా: తమిళనాడులో మొదటి మరణం, ఇండియా టోటల్ 11

తమిళనాడులో ఇవాళ ఉదయం ఓ రోగి మరణించారు. మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న రోగికి కరోనా వైరస్ సోకడంతో చెన్నైలోని రాజాజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం తెల్లవారుజామున మరణించారని తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 11 కు చేరింది.

ఇక దేశవ్యాప్తంగా వరుసగా కేసులు నమోదు కావడం.. మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. దీనిని కట్టడి చేయడాకి ప్రధాని మోడీ మరో 21 రోజులు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read Previous

హంట వైరస్: నిజామా.. అబద్దమా?

Read Next

కరోనా: మా ఇంటికి రావొద్దు, గేట్ కి స్టిక్కర్లు