దేవరకొండ అమ్మాయి…ఓకే రోజు రెండు పెళ్లిళ్లు
Timeline

దేవరకొండ అమ్మాయి…ఓకే రోజు రెండు పెళ్లిళ్లు

శుక్రవారం పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న ఓ యువతి, మరుసటి రోజున తాను మనసిచ్చిన యువకుడిని మనువాడింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కనగల్ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే, శాబ్దులాపురానికి చెందిన మౌనిక అనే యువతి, తన కుటుంబ సభ్యులతో కలిసి పదేళ్లుగా కురంపల్లిలో నివాసం ఉంటుండగా, ఆమెకు దేవరకొండ ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరి వివాహం శుక్రవారం నాడు జరిగింది.

అయితే, తనకు వరుసకు మామయ్యే రాజేశ్ అనే యువకుడిని మౌనిక కొన్నేళ్లుగా ప్రేమిస్తోంది. మౌనిక వివాహమైన కొంత సేపటికి, ఆ ప్రాంతానికి రాజేశ్ వచ్చాడు. రాజేశ్ ను చూసిన మౌనిక, అతన్ని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ, బాధపడింది. దీంతో మౌనికను వివాహమాడిన యువకుడు పెద్దల ముందు పంజాయితీ పెట్టాడు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పెద్దలంతా కలిసి యువతికి శుక్రవారం జరిగిన వివాహం చెల్లదని తీర్మానించి, దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వరుడి ఫ్యామిలీ వెళ్లిపోగా, శనివారం నాడు ఇక్కడి గుడిలో మౌనిక, రాజేశ్ లు మనువాడారు.

Leave a Reply

Your email address will not be published.