in

ఆస్పత్రిలో అమిత్ షా.. చిన్నపాటి సర్జరీ

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. చిన్నపాటి సర్జరీ కోసమే అమిత్ షా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని సమాచారం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న కేడీ ఆసుపత్రిలో ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు.

వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఇటీవల షా సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఆయన వెళ్లారు. ఆయన మంగళవారం సాయంత్రం కుటుంబం సభ్యులను కలుసుకున్నారు. ఈరోజు తిరిగి ఢిల్లీకి ప్రయాణించాల్సి ఉండగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇవాళ సాయంత్రానికి అమిత్ షా డిశ్చార్జ్ కానున్నట్టు తెలుస్తోంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

పెళ్ళికి గోత్రం తప్పనిసరా… సైన్స్ ఏం చెప్పుతుంది?

రాజధాని మార్పు ఉండదు: మంత్రి మేకపాటి గౌతంరెడ్డి