in

On Sept 11th @ 11:11AM ‘నిశ్శబ్దం’

కొంతకాలంగా అనుష్క నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ.. విజయాలను అందుకుంటూ వస్తోంది. ఆమె తాజా చిత్రంగా ‘నిశ్శబ్దం’ రూపొందుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆమె ప్రధానమైన పాత్రను పోషిస్తోంది.

కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి రానున్న ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నామని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

కథాపరంగా విదేశాల్లోనే ఈ సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. మైఖేల్ మ్యాడ్సన్ అనే విదేశీ నటుడితో పాటు, మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

యాదాద్రి గుడి పిల్లర్లపై చెక్కిన కెసిఆర్, కారు బొమ్మలు

కెసిఆర్ .. గుడి నీ అబ్బ సొత్తు కాదు