in

ఆత్మకూరుకు ఫ్యాక్షన్ రాజకీయాలు అంటగడుతున్నారా?

ఛలో ఆత్మకూరు పిలుపేందుకు? ఎవరు మొదలెట్టారు?

అస్సలు చిచ్చు రేపింది ఎవరు? ఏంటా ఆ కథ?

ఒక కుటుంబం గొడవలకి గ్రామం బలవుతుందా?

భవిష్యత్ లో అక్కడికి అమ్మాయిని ఇవ్వాలంటే ఆలోచిస్తారా?

పల్నాడులో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ప్రకటనలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఛలో ఆత్మకూరు పేరుతో టీడీపీ పిలుపునివ్వగా పోటీగా వైసీపీ శ్రేణులు కూడా ఛలో ఆత్మకూరుకు సిద్ధమయ్యాయి. దీంతో పల్నాడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాత్రినుంచే నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వారిని బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆత్మకూరు చేరుకుంటున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తల వాహనాలను కూడా ఎక్కడిక్కడ అడ్డుకుని వెనక్కు పంపుతున్నారు.

ఓ వైపు 144 సెక్షన్‌, మరోవైపు ముందస్తు అరెస్టులు చేస్తుండటంతో పల్నాడులో ప్రస్తుతం టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైసీపీ బాధితులతో టీడీపీ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావులు చలో ఆత్మకూరుకు సిద్దమవగా.. నరసరావుపేట, సత్తెనపల్లిలోని మాజీ స్పీకర్ కోడెల బాధితులతో వైసీపీ నేత అంబటి రాంబాబు, గురజాలలో యరపతినేని బాధితులతో కాసు మహేష్ రెడ్డి, చిలకలూరిపేట టీడీపీ బాధితులతో విడదల రజిని చలో ఆత్మకూరుకు పయనమయ్యారు

ఆత్మకూరులో అసలేం జరిగింది?

ఆత్మకూరు గ్రామంలో ఒక సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు కొన్నేళ్లుగా రెండుగా చీలిపోయాయి. వారంతా దగ్గరి బంధువులే, ఇచ్చిపుచ్చుకున్న వారే. కుటుంబ తగదాలతో వారంతా రెండుగా చీలిపోయారు. వీరంతా తొలి నుంచి టీడీపీలో ఉన్నవారే. ఒకే కాలనీలో నివాసం ఉండేవారు. రెండేళ్ల క్రితం బంధువుల్లోని ఒక వర్గం మరో వర్గంపై దాడి చేసింది. దాంతో భయపడిపోయిన బాధిత వర్గం… ఆ కాలనీని వదిలేసి మరోకాలనీలోకి వచ్చి ఉంటోంది.

ప్రభుత్వం మారడంతో రక్షణ ఉంటుందన్న ఉద్దేశంతో రెండేళ్ల క్రితం కాలనీ వదిలి వెళ్లిన వారు తిరిగి తమ పాత కాలనీకి వచ్చారు. అలా వచ్చిన తర్వాత కూడా ఎలాంటి గొడవలూ జరగలేదు. రెండేళ్ల క్రితం కాలనీ వదిలి వెళ్లిన వారు తిరిగి రావడంతో అప్పటి వరకు ఆ కాలనీలో ఆధిపత్యం చెలాయించిన టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబు ఏర్పాటు చేసిన శిబిరానికి వెళ్లిపోయారు. ఇప్పుడు టీడీపీ వారిని గ్రామం నుంచి తరిమేశారంటూ చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు.

ఈ అంశంపై పలువురు గ్రామస్తులు మీడియా చానళ్ల వద్ద స్పందించారు. చలో ఆత్మకూరు అని చంద్రబాబు పిలుపునిచ్చిన తర్వాత ఇతర గ్రామస్తులు ఫోన్లు చేసి ఏం జరుగుతోందని ఆరా తీస్తున్నారని.. ఇక్కడ తమంతా పొలం పనులు చేసుకుంటుంటే చంద్రబాబు వల్ల తమ గ్రామంలో ఏదో జరిగిపోతోందన్న భావన బయటి ప్రపంచంలో ఏర్పడిందని ఒక రైతు ఆవేదన చెందారు.

”గ్రామంలో గతంలో గొడవపడ్డ వారు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వారంతా చుట్టాలు. వాళ్లు వాళ్లు కొట్టుకుంటే… దాన్ని ఊరి మధ్య చిచ్చుగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఇలాంటి పనికిమాలిన ప్రచారం ఎందుకు చేస్తున్నారు?. తమ గ్రామంపై ఫ్యాక్షన్ ముద్ర వేస్తున్నారు. దీని వల్ల ఈ ఊరికి అమ్మాయిలను కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు” అని మరో పెద్దాయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

”వారంతా ఒకే వర్గం వారు. రెండేళ్ల క్రితం అల్లుడి మీదే మామ దాడి చేయించాడు. దాంతో కొన్ని కుటుంబాలు కాలనీ వదిలి పక్క కాలనీకి వచ్చాయి. ప్రభుత్వం మారిన వెంటనే వారు తిరిగి పాత ఇళ్లకు వెళ్లిపోయారు. దాంతో మరో కుటుంబం వారు చంద్రబాబు శిబిరానికి వెళ్లిపోయారు. వీరు వాళ్లను కొట్టింది లేదు… దాడి చేసింది లేదు. చంద్రబాబు వల్ల మా గ్రామంలో ఏదో జరుగుతోందని… మా గ్రామంలో వారంతా చెడ్డవాళ్లు అన్న ప్రచారం జరుగుతోంది. మా గ్రామానికి పిల్లను ఇచ్చే వారు కూడా ముందుకు రారు” అని మరో రైతు వాపోయారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

తన శాఖ అధికారులతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమీక్ష

పెరుగు సరికొత్త వాస్తవాలు.. పలు పరిశోధనల్లో వెల్లడి