in

రేవంత్ రెడ్డి కి బిగ్ బాస్ టాస్క్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గురించి తెలంగాణాలో చాప కింద నీరులా మెల్ల మెల్లగా చర్చ జరుగుతూనే ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ఖాయమనే వార్తలు రావటంతో రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీ తో కలిసి ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిశాడు.

అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లి రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కకుండా చేయవలసిన పనులు అన్ని చేస్తున్నారు. దీనితో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి విషయంలో కొంచం వెనక్కి తగ్గింది. అయితే పూర్తిగా ఆ విషయాన్నీ మాత్రం పక్కన పెట్టలేదు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో ఒక యూనిటీ అనేది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే తమ దారి తాము చూసుకుంటామని సీనియర్లు హెచ్చరించటంతో కాంగ్రెస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు.

పార్టీలోని సీనియర్ నేతలను ఒప్పించి, వాళ్ళ పూర్తి అంగీకారంతో వస్తే నీకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తుంది. పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పనిచేస్తేనే అధికారం అందుంటుంది. ఆలా కాకుండా ఇలా వర్గాలుగా పనిచేస్తే మొదటికే మోసం వస్తుంది. నీ విషయంలో అందరు కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చేలా చేసుకోవటం నీ బాధ్యత. కాబట్టి సీనియర్లతో మంతనాలు జరిపి ఈ విషయాన్నీ ఒక కొలిక్కి తీసుకోనిరా అంటూ రేవంత్ రెడ్డికి అధిష్టానం చెప్పినట్లు తెలుస్తుంది. దీనితో ప్రస్తుతం రేవంత్ రెడ్డి తన పరిచయాలు ఉపయోగించి కాంగ్రెస్ పెద్దలను ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

బిగ్ బాస్ 3: ఈసారి శ్రీముఖి ఎలిమినేట్ ఖాయమట!

ఈసారి విజయసాయి రెడ్డి.. కథ మొదలెట్టిన బీజేపీ