in

సాయిధ‌ర‌మ్ తేజ్ న్యూ మూవీ ఫ‌స్ట్ లుక్ విడుదల

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ప్ర‌తి రోజు పండ‌గే’. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో సాయి ధరమ్‌ సరసన రాశీ ఖ‌న్నా మరో సారి జంటగా కనిపించనన్నారు.

కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌లో తేజూ క‌నిపించ‌నున్నాడు. స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో నటిస్తుండగా.. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందించ‌డం ఖాయ‌మ‌ని చెబుతోంది సినిమా యూనిట్‌.

తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో స‌త్య‌రాజ్ జంప్ చేస్తుంటే తేజూ ప‌డిపోతావు అన్న‌ట్టుగా ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చాడు. చిత్రంలో వీరిద్ద‌రు తండ్రి , కొడుకులుగా క‌నిపిస్తార‌ని టాక్. చిత్ర ఫ‌స్ట్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. డిసెంబ‌ర్‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు .

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఛలో ఆత్మకూర్ : చంద్రబాబుకి వడ్డీతో తిరిగిచ్చేసిన జగన్

అవును, రిలేషన్‌ షిప్‌లో ఉన్నాను. పెళ్లి మాత్రం…