in

తలసాని కొడుక్కి ఫైన్ వెయ్యరా సార్?

ఆ గోడలపై పోస్టర్లు చూస్తే కాకా పట్టడానికే ఈ ప్రయత్నం అని ఇట్టే అర్దమైపోద్ది

తెరాస లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ సిటీ గోడలను పోస్టర్లతో నింపేసి గబ్బు గబ్బు చేసేసాడు. దానికి కారణం ఏంటంటే, కొత్తగా కెసిఆర్ క్యాబినెట్ లోకి మంత్రి పదవితో తిరిగి అరంగేట్రం చేసిన తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అభినందించడానికే.

సాయి కిరణ్ యాదవ్ మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కొట్టేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. కాకపోతే కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

ప్రజలు తప్పు చేస్తే ప్రశ్నించడానికి పోలీసులున్నారు , అయితే పోలీసులు, ప్రభుత్వాలే తప్పు చేస్తే ఎవరిని అడగాలి? ఇది ఒకప్పటి మాట కానీ ఇపుడు ఆ జవాబుదారీతనాన్ని ప్రభుత్వాల నుండి పోలీసుల నుండి మనమే రాబట్టుకోవాలి. దానికి ఆయుధమే సోషల్ మీడియా.

ఒక పొలిసు తప్పు చేసినా, ప్రభుత్వ ప్రతినిధి తప్పు చేసిన సోషల్ మీడియా లో ఒక చిన్న పోస్టు పెట్టడమే మనం చేయగలిగేది. బయట ఒక కంప్లైంట్ ఇస్తే పట్టించుకుంటారో లేదో కానీ సోషల్ మీడియా లో ఒక పోస్టు పెట్టి చూడండి. అది వైరల్ ఎక్కడ అవుద్దో అని ముందే హుటా హుటిన మనకు సమాధానం వచ్చేస్తుంది. తెలంగాణ లో ఇది కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు వేరే రాష్ట్రాలతో పోలిస్తే.

అయితే తలసాని తనయుడు సాయి కిరణ్ చేసిన పనిని ఫోటోలు తీసి ట్విట్టర్ లో పెట్టి GHMC అధికారులను అడిగేశాడు హరీష్ దాగా అనే సోషల్ యాక్టివిస్ట్.

అధికారం లో ఉన్నవాళ్లే ఇలా చేస్తే ఎలా , మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ ఇలాంటి చర్యలను ఎలా సపోర్ట్ చేస్తారు. సిటీ ని క్లీన్ గా ఉంచమని సలహా ఇచ్చాడు.

ఆ తరువాత , సాయి చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి, ఇది ఎవరో చేసారని చెప్పుకొచ్చాడు.

రూల్స్ ప్రకారం అయితే తప్పు చేసిన వ్యక్తికి, ఒక్కో పోస్టర్ కి 2000 రూపాయలు ఫైన్ వెయ్యాలి. మరి GHMC ఫైన్ వేస్తుందా లేదా చూడాలి.

గతంలో, కేటీఆర్ పార్టీ లీడర్స్ ని, కార్యకర్తలను ఎటువంటి హోర్డింగులు, వాల్ పోస్టర్లు పెట్టి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పొద్దని చెప్పారు.

యాదవ్ ఈ మధ్య వేరే కారణం చేత కూడా న్యూస్ లో వచ్చాడు. మాజీ గవర్నర్ నరసింహన్ వీడ్కోలు సభ కి డిప్యూటీ స్పీకర్ గా చేసిన పద్మ దేవేందర్ కి అనుమతి ఇవ్వకుండా అసలు ఏ అర్హత, పదవి లేని సాయి ని అనుమతించడంతో చాలానే వ్యతిరేకత మూటకట్టుకుంది తెరాస.


What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

చంద్రయాన్-2: రంగంలోకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ

అనుష్క శర్మ బీచ్ ఫోటో వైరల్.. కోహ్లీ ట్వీట్