in

బిజెపి ఎంపీతో టిఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ – జంపింగ్ జపాంగ్?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ, లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకుని ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది. అయితే కేంద్రంలో ఎలాగో బీజేపీ అధికారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాలలో మరింత పట్టును పెంచుకునేందుకు బీజేపీ ఆకర్ష్ మొదలుపెట్టింది. అటు ఏపీలో ఇప్పటికే టీడీపీనీ వీడి చాలా మంది నేతలు బీజేపీలో చేరిపోయారు.

తెలంగాణలో కూడా ఇతర పార్టీల నుంచి చాలా మంది సీనియర్ నేతలు బీజేపీలో చేరిపోయారు. అయితే గత కొద్ది రోజులుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో కూడా అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. ఇటీవల ఈటెల మరియు నాయిని చేసిన కామెంట్లు చూస్తుంటే అసలు పార్టీలో ఏం జరుగుతుందనేది ఎవరికి అర్ధం కావడం లేదు. అయితే వీరి గొడవ కాస్త సర్ధుమనిగినట్టు కనిపించినా తాజాగ మరో వార్త ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతుంది.

ఇటీవల ప్రకటించిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్ద బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ని కలవడం పార్టీలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతోనే అయన బీజేపీ ఎంపీనీ కలిసారని, త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఇది కామెడీ కాదు కానిస్టేబుల్ గా తన కష్టం

రెండో రాజధానిగా సీమ: బీజేపీ నేత