in

‘సైరా’ ఆడియో రిలీజ్: కేటీఆర్ బిజీ.. ముఖ్య అతిథిగా పవన్, రాజమౌళి

హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సైరా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఖరారు చేసింది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఈ నెల 18న ప్రి-రిలీజ్, ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో అందుకు తగ్గట్లే ఎల్‌బీ స్టేడియంలో భారీ సెట్‌ వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో అతిథులకు సంబంధించి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ మంత్రి కేటీఆర్, దర్శకులు రాజమౌళి, శివ కొరటాల, వివి వినాయక్ ముఖ్య అతిథులగా హాజరవుతారని తెలిపింది. ఐతే ఈ ప్రకటన చేసిన కాసేపటికే ట్విటర్ వేదికగా మరో ప్రకటన చేశారు. సైరా ప్రిరిలీజ్ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హాజరుకావడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఆయన రావడం లేదని తెలిపారు.

‘సైరా’ ఆడియో రిలీజ్‌కు ముఖ్య అతిథిగా రానున్న పవన్ కల్యాణ్… తన అన్న చిరంజీవిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సైరా సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తూ.. ఇప్పటికే అన్నపై తన మమకారం చూపించారు పవన్. ఈసారి ఏకంగా అభిమానులకు ఒకే స్టేజ్‌పై అన్నదమ్ములు కనిపించనుండటంతో పవర్ స్టార్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో మెగా ఫ్యామిలీ అభిమానులంతా 18వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

రెండో రాజధానిగా సీమ: బీజేపీ నేత

ఫోన్ మాట్లాడుతూ.. జంట పాములపై కూర్చుంది