in

జగన్ నిర్ణయాలే జనసేనకు బలం చేకూరుస్తున్నాయా!

సీఎం జగన్ మోహన్ రెడ్డి 100 రోజుల పాలన గురించి ఆంధ్ర ప్రదేశ్ అంతటా చర్చలు జరుగుతూనే వున్నాయి. ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి, ప్రజలకు మేలు చేసారని వైసీపీ నేతలు చెబుతూనే వున్నారు. 100 రోజుల్లో 100 మంచి పనులు చేశామని చెప్పే నేతలు కూడా వున్నారు.

టీడీపీ నేతలు మాత్రం చేసింది శూన్యం ఇంకా చెడ్డ ముఖ్యమంత్రి గా, తుగ్లక్ పాలన గా పేరు తెచ్చుకున్నారు అని అంటూనే వున్నారు. తుగ్లక్ ఐన కొన్ని మంచి పనులు చేసారని జగన్ అవి కూడా చేయలేదు అంటూ ఎద్దేవా చేసారు. జనసేన పార్టీ తన విధి విధానాలతో ఆలోచనతో ముందుకు వెళ్తుంది. సమస్యల పై పోరాడటం తో మిగతా పార్టీ ల కంటే తమ ఉనికిని గట్టిగానే చాటుకుంటుంది. అయితే పవన్ సెప్టెంబర్ 14 న జగన్ 100 రోజుల పాలన పై తన అభిప్రాయాన్ని తెలియజేయనున్నారు.

అయితే పీపీఏ విషయం లో చంద్రబాబు ని అనుసరించక తప్పలేదు జగన్ మోహన్ రెడ్డి గారికి, పోలవరం, అమరావతి, కృష్ణ వరదలు పెద్ద పెద్ద సమస్యలను దీటుగా ఎదుర్కోవడం లో విఫలమయ్యారని చెప్పొచ్చు. అవినీతిరహిత రాష్ట్రం గా ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నా జగన్ మోహన్ రెడ్డి పెట్టుబడులే సరిగ్గా ఆంధ్ర ప్రదేశ్ కి రావడం లేదని బీజేపీ, టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వారి పరిస్థితి ఎలా వున్నా పవన్ ఈ విషయాలు ప్రసంగిస్తే రాజకీయం గా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

సీపీఎస్ రద్దుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని ఖరాకండిగా చెబితే జగన్ పని ఇక అంతే, సిపిఎస్ రద్దు చేస్తాను అని, సీఎం అయ్యాక తోలి పని ఇదేనని అన్నారు. చంద్రబాబు చేస్తున్నట్లు, జగన్ కూడా కాలయాపన చేస్తున్నారని సోషల్ మీడియా జనసేన ద్వారా అన్నారు. ఇదే కానీ జరిగితే జగన్ మరో బలమైన జనసేన పార్టీ ని ఎదుర్కోవాలంటే కష్టమనే చెప్పాలి. ఎప్పటికపుడు సమస్యలపైనా పవన్ నిలదీస్తూనే వున్నా, పనుల్లో అలసత్వం వలన జగన్ ప్రభుత్వం పవన్ చేతికి చిక్కినట్లుగా తయారవుతుంది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

BJP లో చేరనున్న 8 మంది TRS నాయకులు వీళ్లేనా?

ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2019