in

యువతి ప్రాణాలు తీసిన ప్లెక్సీ.. హైకోర్టు సీరియస్.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..

చెన్నైలో అక్రమ హోర్డింగ్స్ ఏర్పాటుపై నిషేధం విధించినప్పటికీ యధావిధంగా కొనసాగిస్తున్నారు. వివాహాలకు, రాజకీయ నాయకులకు ఎక్కడ చుసిన ఫ్లెక్సీల మాయం అవుతుంది. ప్రస్తుతం అన్నాడీఎంకే నేత ఇంట్లో వివాహానికి హాజరువుతున్న పన్నీరుసెల్వం కు రోడ్లన్నీ ఫ్లెక్సీలమయం చేశారు కార్యకర్తలు. ఈ క్రమంలోనే ఒక ఫ్లెక్సీ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణ చెన్నై పరిధిలోని పల్లికరనైలో ఫ్లెక్సీ అదుపు తప్పిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. శుభశ్రీ (23) అనే యువతి బైక్ పై వెళ్తుండగా రోడ్డు డివైడర్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ గాల్లో ఎగురుతూ ఆమె బైక్ పై పడింది. వెంటనే ఆమె బైక్ కంట్రోల్ చేసినప్పటికీ వెనక నుంచి వచ్చే వాటర్ ట్యాంకర్ కంట్రోల్ అవ్వలేక ఢీకొట్టింది. అప్రమత్తమైన స్థానికులు హాస్పిటల్ కి చేర్చిన లాభం లేకుండా పోయింది.

ప్రస్తుతం ఆమె ఆక్సిడెంట్ దృశ్యాలను విడుదల చేశారు ట్రాఫిక్ పోలీసులు. దింతో ఒక్కసారిగా నిరసనలు మొదలైయ్యాయి. దీనికి బాధ్యత ఎవరు? సుభశ్రీ ని చంపింది ఎవరంటూ సాంఘిక మాధ్యమాల్లోను #WhoKilledShubashree #Chennai #AdmkKilledSubasri అంటూ పోస్టులు, హ్యాష్ ట్యాగ్ లు ఎక్కువ అవ్వడంతో ట్రేండింగ్ లో ఉంది. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎన్ని లీటర్ల రక్తం చిందాలనుకుంటున్నారని తమిళనాడు ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ 2019

బీజేపీ అంతర్గత ఎన్నికల షెడ్యూల్.. అధ్యక్షుడిగా..!